ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో జనవరి 16 నుండి 22 వరకు అయోధ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
ఈ రూటులో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో సహా మొత్తం ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే డూన్ ఎక్స్ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి.