కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలోని జోన్-4లో 21 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్టు చేయాలని పేర్కొంది.
కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్‌గా పద్మజ. కోసిగికి పి.మురళి, కౌతాళంకు అలెగ్జాండర్. అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్‌గా పద్మావతమ్మ, కల్యాణదుర్గానికి సుభాకర్రావు, రాప్తాడుకు రామాంజనమ్మ తదితరులు బదిలీ అయిన వారిలో ఉన్నారు.