పీసీసీ అధ్యక్షురాలిగా సీఎం జగన్ సోదరి షర్మిల నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి.
అయితే ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు తమ కంచుకోటగా భావించే వైసీపీ ఓటు బ్యాంకుపైనా షర్మిల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి షర్మిల పులివెందుల అసెంబ్లీ స్థానం లేదా కడప పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.