ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాముడు,
అయోధ్య ఆలయ ఫోటోలతో కొత్త రూ.500 నోటును విడుదల చేయనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. కానీ ఇది ఫేక్ నోటు. దీనిపై ఆర్బీఐ అధికారిక ప్రకటన వెలువరించలేదు.