ఏపీ సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ నేటినుంచి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నిరాహారదీక్షకు దిగనున్నారు.
అలాగే శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన తల్లి, సోదరుడు విజయవాడలో నేటినుంచి ఆమరణ నిరహార దీక్షకు దిగనున్నారు. దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని లేదా సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలనే డిమాండ్‌తో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దీక్షకు దిగుతున్నారు.