తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, నెల్లూరు(రూరల్) ఇన్ఛార్జిగా నియమించి పార్టీ తనకు గుర్తింపు ఇచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైసీపీని వీడాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.