రామ మందిర ప్రారంభోత్సవంపై సైబర్ నేరగాళ్ల కన్నుపడింది. ఆలయ పనులు వేగంగా పూర్తిచేసేందుకు విరాళాలు కావాలంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
తాజాగా విరాళాలు ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ క్యూఆర్ కోడ్లను పంపుతున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రచారాలను నమ్మొద్దని.. వాట్సప్ సందేశాలు, నకిలీ లింకులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.