ఏపీలో ఎడ్ సెట్ పరీక్షను 2023 మార్చిలో నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ లో పరీక్ష నిర్వహించి, జూలై 14న ఫలితాలను విడుదల చేశారు. ఇందులో 10,908 మంది ఉత్తీర్ణులైయ్యారు.
ఫలితాలు వెల్లడై ఆరు నెలలు పూర్తయినా కౌన్సిలింగ్ నిర్వహించలేదు. దీంతో బీఈడి కౌన్సిలింగ్ నిర్వహణ జాప్యాన్ని సవాల్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం తరపున హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.