లేపాక్షి ఆలయం హిందూపురం నుంచి 15 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఓ ప్రత్యేకమైన రహస్యం ఏంటంటే. గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి అనుకోని ఉన్నాయి.
కానీ ఒక్క స్తంభం మాత్రం కింద ఏ ఆధారం లేకుండా ఉంది. ఈ స్తంభం కింద సుమారు పావు అంగుళం మేర ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది. ఏ కారణంచేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే, ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం కిందకు ఆని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందంట.