పాక్ లోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకు పడింది. జైష్-అల్-అదల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
అయితే ఇరాన్ దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడిలో ఇద్దరు అమాయక పిల్లలు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని పేర్కొంది. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.