సంక్రాంతికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపళ్లి గణేశ్ కుమార్ తన విద్యా సంస్థలో మద్యం పంపిణీ చేయడం విద్యా వ్యవస్థను బ్రస్టు పట్టించడమే అని వైసిపి మాజీ నేత సీతoరాజు సుధాకర్ ఆరోపించారు.
ఒక వ్యక్తి వద్ద మూడు మద్యం సీసాలు కంటే, ఎక్కువ మద్యం సీసాలు కలిగి ఉండటం నేరమన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.