విజయనగరం జిల్లాలో గంగులు కుటుంబానికి జరిగిన దారుణంపై TDP చీఫ్ చంద్రబాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఈ దారుణం విని చలించిపోయా. ఆస్పత్రికి వెళ్లాలంటే 5 కి.మీ.డోలీపై మోసుకొని వెళ్లడం దురదృష్టకరం.
ఇలాంటి దుస్థితి రాకూడదనే గతంలో ఫీడర్ అంబులెన్సులు తీసుకొచ్చాం. తల్లి, బిడ్డ చనిపోయేందుకు కారణం ప్రభుత్వ అలసత్యం కాదా? కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా? ఘటనపై విచారణ జరిపించాలి.' అని అన్నారు.