తమిళనాడులో సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వహించిన సాంప్రదాయక క్రీడ జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలో జరిగిన పోటీల్లో ప్రమాదవశాత్తు ఓ మైనర్ సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
పోటీలను వీక్షిస్తుండగా ఎద్దుల మధ్య పడి నలిగిపోయి వారు ప్రాణాలు కోల్పోయారు. పురాతన కాలం నుంచి కొనసాగుతున్న ఈ జల్లి కట్టు ఆటలో గాయాలవుతాయని తెలిసినా ఎవరు వెనక్కి తగ్గడం లేదు.