అంబేద్కర్ పేరిట వైసీపీ రూ.కోట్లు దోచేస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును పరిశీలించి మాట్లాడారు. హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు.
ఏపీలో విగ్రహానికి రూ.400 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? అని ప్రశ్నించారు. టీడీపీ సర్కారు రూ.137 కోట్లతో స్మృతివనం ఏర్పాటు చేసిందన్నారు. టీడీపీ హయాంలో 26 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.