రుద్రవరం మండల తహసీల్దారు కార్యాలయం ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మె 37వ రోజు కు చేరుకుంది. ఈ సందర్భంగా మండలంలోని టీచర్లు ఆయలందరు దీక్షా శిబిరంలో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించి, షోకాజు నోటీసులు పంపించిన, మంత్రుల బృందం, సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడినా తమ ఉద్యమాన్ని విరమించేది లేదని హెచ్చరించారు.