ఏపీ రాష్ట్రంలోని ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు.
ఈ మేరకు ఏపీ సబార్డినేట్ సర్వీసు నిబంధనల్లో సవరణలు చేయనున్నారు. నిర్దేశించిన 4శాతం రిజర్వేషన్లో ఒక శాతం మూగ, బధిర, అంధ, మరుగుజ్జుతనం తదితర విభాగాలకు కల్పించనున్నారు.