ఏపీలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ఇండ్లు కట్టుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం నేడు వడ్డీ రీయింబర్స్మెంట్ చేయనుంది.
తొలిదఫాలో అర్హులైన 4,07,323 మందికి వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90కోట్లను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. మహిళలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ, ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్న సంగతి విధితమే.