ఏపీలోని పుట్టపర్తిలో దారుణం చోటుచేసుకుంది. భూగర్భ జలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న అధికారి రాజశేఖర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది.
బుధవారం అర్థరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు దుండగులు ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ క్రమంలో అధికారి రాజశేఖర్ రక్తపు మడుగులో పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్యసాయి ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa