భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ఇటీవల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూ హ్యాంప్‌షైర్‌లో ప్రచారం నిర్వహించగా ఆయనతో వివేక్ రామస్వామి వేదిక పంచుకున్నారు.
దీంతో ట్రంప్ మద్దతు దారులు ఆయనని వీపీ(ఉపాధ్యక్షుడు) అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు.