ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావడం లేదని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలో మధ్యాహ్నం విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరుకానున్నారు. అనంతరం గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.