అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహప్రతిష్ఠాపన ఈ నెల 22న జరగనుంది. ఈ వేడుకకు శ్రీరాముని భక్తుడైన హనుమంతుని రాకకు చిహ్నంగా ఆయన జన్మస్థలమైన కర్ణాటకలోని కిష్కింధ నుంచి రథాన్ని అయోధ్యకు తీసుకువచ్చారు.
మూడేళ్లుగా దేశమంతటా తిరుగుతూ.. సీతామాత జన్మస్థలమైన బిహార్లోని సీతామర్హి గుండా అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలో రామాలయం తరహాలోనే కిష్కింధలో కూడా హనుమంతుని ఆలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్వామిగోవిందానందసరస్వతి తెలిపారు.