రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను చంపుతామని బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపు కాల్ చేసిన లోకేషన్‌ను ట్రేస్ చేశారు. జైపూర్ సెంట్రల్ జైలు నుంచి ఫోన్ వచ్చినట్టు గుర్తించారు.
పోక్సో చట్టం కింద అరెస్టై జైలులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఫోన్ చేశాడని గుర్తించారు. ఈ కేసులో ముఖేశ్, రాకేశ్, చేతన్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.