ఆమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రయాణించాల్సిన విమానంలో వైఫల్యం తలెత్తింది. దావోస్ సదస్సుకు వెళ్లిన ఆంటోనీ బ్లింకెన్ స్విట్జర్లాండ్లో చిక్కుకుపోయారు. ఆయన ప్రయాణించాల్సిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఆక్సిజన్ లీకేజీ చోటు చేసుకొన్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా వాయుసేన మరో విమానం పంపడంతో ఆయన దావోస్ నుంచి తిరుగుపయనమయ్యారని అధికారులు మీడియాకు తెలిపారు.