ఎర్ర సముద్ర సంక్షోభం నేపథ్యంలో సరుకు రవాణా వ్యయాల పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఎగుమతిదార్ల అవసరాలను పర్యవేక్షించాలని ఆర్థిక శాఖల విభాగానికి (డీఎఫ్ఎస్) వాణిజ్య శాఖ సూచించింది.
వారికి రుణలభ్యతపై దృష్టి పెట్టాలని పేర్కొంది. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ నేతృత్వంలో నిర్వహించిన అంతర్–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఎగుమతిదారుల సమస్యలను చర్చించారు.