గురువారం పుత్తూరు-చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే విద్యుత్ స్తంభం కూలడంతో విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. 9 గంటల తర్వాత విద్యుత్ అధికారులు మరమ్మత్తులు చేసి సరఫరాను పునరుద్ధరించారు.