లబ్ధిదారులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూముల వివరాలను తెలపాలని టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి కోరారు. గురువారం వేంపల్లి రెవెన్యూ కార్యాలయంలో ఉన్న తహశీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డికి టిడిపి నాయకులతో కలిసి మండల కన్వీనర్ వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సమాచార చట్టం కింద డికేటి పట్టాలు ఇచ్చిన లబ్ధిదారుల వివరాలను, మదీనా పురం కాలనీకి చెందిన భూమి వివరాలు ఇవ్వాలని తహశీల్దార్ కు కోరినట్లు చెప్పారు.