ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామాలయాన్ని ఆస్ట్రేలియాలో నిర్మించనున్నారు. 721 అడుగుల ఎత్తైన ఈ ఆలయాన్ని సుమారు రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
శ్రీరామ్ వేదిక్, కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెర్త్‌లో ఈ ఆలయం రూపుదిద్దుకోనుంది. 150 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని, ఆలయ కాంప్లెక్స్ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నట్లు ట్రస్ట్ డిప్యూటీ హెడ్ హరేంద్ర రాణా తెలిపారు.