ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ కంపెనీ ఎన్‌హెచ్‌పీసీలో 3.5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. షేరుకు రూ.66 ధర నిర్ణయించింది.
ఇప్పటికే ఈ ఆఫర్ ఫర్ సేల్ ప్రారంభమైంది. ఓఎఫ్ఎస్ ద్వారా 2.5 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2 వేల కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఒకవేళ ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ అయితే మరో 1 శాతం వాటాను ఆఫ్‌లోడ్ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.