ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోమని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది.
పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్‌ను తొలగించింది. భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉదాయ్) ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ తాజాగా వెల్లడించింది. ఇకపై ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు పత్రంగా పరిగణిస్తామని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa