ఓ వ్యక్తి తన మాజీ భార్యతో సహా నలుగుర్ని కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగింది. అల్రిక్ షాన్ బాలెట్ అనే వ్యక్తి హ్యూస్టన్లోని తన మాజీ భార్య ఇంటికి వెళ్లాడు.
అక్కడ ఆమెతో పాటు కొంత మంది బంధువులు కూడా ఉన్నారు. ఇద్దరం కలిసి ఉందామని మాజీ భార్యను బాలెట్ అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. దాంతో కోపోద్రిక్తుడైన బాలెట్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతడి మాజీ భార్య, ముగ్గురు బంధువులు మరణించారు.