కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై అస్సోంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్‌లో మార్పులు చేయడంతో పోలీసులు..
యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై కేసు నమోదు చేశారు.కాగా ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ ఖండించింది. యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అసోం ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా మండిపడ్డారు.