ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు జరపడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఎలాంటి కార్యకలాపాలకు ఈ భూములను ఉపయోగించకూడదని ఆదేశించింది. రామానాయుడు స్టూడియోకు 2003లో సినీ అవసరాలకు వినియోగించేందుకు అప్పటి ప్రభుత్వం 35ఎకరాల భూమిని కేటాయించింది.