మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అయోధ్య రాముడి విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గర్భగుడిలో ఏర్పాటు చేసిన విగ్రహం పాతదని, తన అభిప్రాయన్ని బలపరచడానికి జోషిమఠ్‌లోని శంకరాచార్య స్వామి స్వరూపానంద్ జీ మహారాజ్ అభిప్రాయం కూడా తీసుకున్నానని అన్నారు. రెండవ విగ్రహం అవసరం లేదని, రామజన్మభూమి ఆలయంలో బాల రాముడి రూపంలో విగ్రహం ఇప్పటికే ఉందన్నారు.