పేదలు వైద్య సేవలు పొంది ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని వైసీపీ మదనపల్లె ఇన్ఛార్జి నిస్సార్ హహమ్మద్ కోరారు. మండలంలోని కురవంక సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2 వైద్యశిబిరం సర్పంచ్ పసుపులేటి చలపతి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. నిస్సార్ హహమ్మద్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యాన్ని కాపాడటానికి జగనన్న వైద్య సేవలను తీసుకువచ్చారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa