వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల నాలుగవ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించాం.. అయితే, నాలుగవ జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసిన జాబితాను మంత్రి మీడియాకు వివరించారు.
చిత్తూరు లోక్ సభ స్థానానికి ఇన్ ఛార్జ్ గా(ఎంపీ) నారాయణస్వామి..
జీడీ నెల్లూరు ఇన్ ఛార్జ్ గా- రెడ్డప్పా
శింగనమల- ఎం వీరాంజనేయులు
తిరువూరు- స్వామిదాస్
మడకశిర -ఈర లక్కప్ప
కొవ్వూరు – తలారి వెంకట్రావ్
కనిగిరి – దద్దాళ నారాయణ యాదవ్
గోపాలపురం – తానేటి వనిత
నందికొట్కూరు – డా. సుధీర్ దారా