దేశ చరిత్రలోనే మహాఘట్టంగా నిలిచిపోయే 206 అడుగుల ఎత్తైన డా బి. ఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ నేటి సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగనుందని, ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు అంబేద్కర్ సిద్దాంతాలకు అభిమానించే వారు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు లక్షా యాభై వేల మంది ప్రజలు హాజరు కానున్నారని రాజ్యసభ సభ్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో శుక్రవారం జరగనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 'సామాజిక న్యాయ మహాశిల్పం' ఆవిష్కరణ, సామాజిక సమతా సంకల్ప సభ కార్యక్రమాల ఏర్పాట్లను గురువారం నాడు పార్టీ నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి పరిశీలించారు..అలాగే అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం కింద ఏర్పాటు చేసిన అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసే మ్యూజియంను పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు.