175కు 175 స్థానాలు గెలవడం కోసమే మార్పులు.. చేర్పులు జరుగుతున్నాయని మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పుకొచ్చారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి ఉషశ్రీ మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్ ఆదేశం మేరకు పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. పార్టీలో ఎక్కడా అసంతృప్తి లేదని.. అందరం కలిసే ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. తమ బ్రాండ్ జగనే అని.. 175 స్థానాలు కచ్చితంగా కైవసం చేసుకుంటామని మంత్రి ఉషశ్రీ చరణ్ ధీమా వ్యక్తం చేశారు.