నెల్లూరు జిల్లా, కావలి మండలం చలంచర్ల పంచాయతీ పెద్దారం అటవీ ప్రాంతంలో కోడి పందేల స్థావరంపై ఆదివారం రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రూరల్ సీఐ శ్రీనివాసరావు, తన సిబ్బందితో నిర్వహించిన దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ. 5,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.