గుంతకల్లు పట్టణంలో గడప గడప కార్యక్రమం కింది చేయాల్సిన పనులు వెంటనే చేపట్టాలని, లేదంటే ప్రభుత్వం విడుదల కోటికి పైగా నిధులు మురిగిపోతాయని టిడిపి కౌన్సిలర్ పవన్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ భవాని అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. టిడిపి కౌన్సిలర్ కృపాకర్, పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గడప గడప పనులను వెంటనే ప్రారంభించాలని కమిషనర్ మల్లికార్జునను కోరారు.