ఏపీలో వారం రోజులు ఈ-ఆఫీస్ సేవలు నిలిచిపోనున్నాయి. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు,
జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ-ఆఫీస్ సేవలు వారం రోజులు నిలిచిపోనున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 వరకు ఈ సేవలు నిలిచిపోతాయి. ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.