గ్యాస్ డెలివరీ బాయ్ ఫాంటసీ క్రికెట్ గేమ్‌లో జాక్‌పాట్ కొట్టాడు. డ్రీమ్-11 యాప్‌లో గేమ్ ఆడిన అతడు రూ.49 పెట్టి ఏకంగా రూ.కోటిన్నర కైవసం చేసుకున్నాడు.
బిహార్‌లోని అరారియా జిల్లా పటేగనాకు చెందిన సాదిఖ్ ఓ ఏజెన్సీలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సాదిఖ్ ఈ నెల 14న జరిగిన భారత్-అఫ్గానిస్థాన్ టీ20 మ్యాచ్ సందర్భంగా డ్రీమ్-11లో గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు.