చైనాలోని ఓ స్కూల్ హాస్టల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం సంభవించి 13 మంది మరణించినట్లు తెలుస్తోంది.
జిన్హువా స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. ఈ ఘటన సెంట్రల్ చైనాలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి చిన్న పిల్లల పాఠశాలలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.