అంగన్వాడీలు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు, మహిళా సంఘం (ఐద్వా ) నేతలు శనివారం చల్లపల్లిలో రహదారిని దిగ్బంధనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మధు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa