అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం మారుమూల పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీ పరిధి రాచకిలం గ్రామానికి చెందిన బాబురావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో రాచకిలం గ్రామానికి రహదారి సౌకర్యం లేక బాబురావుని కుటుంబీకులు డోలి కట్టి సుమారు 7 కిలోమీటర్లు వరకు మోసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో ఏరియా ఆస్పత్రికి తరలించారు.