ఒక్క చాన్స అంటూ అధికారంలోకి వచ్చిన జగన రెండు సార్లు స్టీలు ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేసి ఫోజులు కొట్టారు. తరువాత ఏమీ లేదు. మీ జీవితాలు బాగుపడ్డాయా.. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా.. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా.. కనీసం పిల్ల కాల్వ అయినా తవ్వారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమలో అవుకు టన్నెల్ పూర్తి చేసి పులివెందులకు నీళ్లిచ్చి ఎండుతున్న పంటలు కాపాడాం. టీడీపీ హయాంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ.20వేలకోట్లు ఖర్చు పెడితే అందులో 20 శాతం కూడా జగన ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. దివంగత ఎన్టీఆర్ హయాంలోనే కడప జిల్లాలో తెలుగుగంగ, హంద్రీనీవా, బ్రహ్మంసాగర్, గండికోట ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో పెండింగు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. కడప జిల్లాను నెంబర్‌వనగా తీర్చిదిద్దుతాం అన్నారు. తన పాలనలో 90 శాతం సబ్సిడీతో 10 లక్షల మంది రైతులకు డ్రిప్ ఇచ్చామని, జగన అటకెక్కించారని అన్నారు. టీడీపీ వచ్చిన వెంటనే డ్రిప్ కొనసాగిస్తామన్నారు.