మాటతప్పుడే సీఎం జగన్ నైజమని యూటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మీగడ వెంకటేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పొదిలి యూటీఎఫ్ కార్యాలయం నుంచి విశ్వనాథపురంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు మాట తప్పను, మడమతిప్పను అని మాయ మాటలు చెప్పి వంచనతో జగన్ అధికారంలోనికి వచ్చాడ న్నారు. అధికార వ్యామోహంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు నెరవేర్చలేని హామీలు ఇచ్చాడన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏదో చేస్తాడని ఆశపడి ఓట్లు వేశారన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. ఎప్పటికప్పుడు పీఆర్సీ, మంచి ఫిట్‌మెంట్ ఇస్తానని నమ్మబలికిన జగన్ ఇప్పుడు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నాడన్నారు. కనీసం ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడ న్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 27 శాతం ఫిట్‌మెంట్‌ను 23 శాతానికి కుదించారన్నారు. అలా చేసిన ఏకైన ముఖ్య మంత్రి ప్రపంచంలో జగన్ మాత్రమేనని విమర్శించారు. ఉద్యోగులు వివిధ అవసరాలకోసం పీఎఫ్‌లో డబ్బులు దాచుకుంటారని అయితే ఇప్పుడు ఏ ఉద్యోగి అకౌంట్‌లో ఒక్క పైసా కూడా లేకుండా తమ అనుమతి లేకుండా పూర్తిగా వాడుకున్న ఘనుడు జగన్‌రెడ్డి అన్నారు. తాము దాచుకున్న డబ్బులకు లోన్ పెట్టుకున్నా వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. 185 నెలల డీఏ బకాయిలు చెల్లించలేదన్నారు. తాము జీతాలు పెంచమని అడగడం లేదని దాచుకున్న డబ్బులు ఇవ్వండని అర్తిస్తున్నామన్నారు. తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల లో పీఆర్సీ, అరియర్స్ రిటైరైన తరువాత ఇస్తామ ని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్న జగన్ ఈ నెల 31న రిటైర్ అయ్యో ఉద్యోగులకు ఆడిట్ జనరల్ ఆఫీస్ నుంచి వింత ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఆ ఉత్త ర్వుల మేరకు 2026 అక్టోబర్‌లో గ్రాడ్యుటీ ఇస్తా మని, మిగిలిన మొత్తం 2030లో చెల్లిస్తామని సమాచారం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఇట్టే అర్ధం చేసుకో వచ్చన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు అబ్దుల్‌హై, జిల్లా కార్యదర్శి పి బాలవెంకటేశ్వర్లు, యూటీఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యులు బుజ్జిబాబు, నాయకులు కె నాసర్ అహమ్మద్, ఎన్ కామేశ్వరరావు, పి శ్రీనివాసులు, సంజీవరావు ఎస్ సత్యనారాయణ, పాలడుగు వెంకటేశ్వర్లు, తదితర ఉపాద్యాయులు పాల్గొన్నారు.