నూజివీడు పట్టణంలో అనధికారికంగా ఉపయోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ పి.శివరామకృష్ణ, విజిలెన్స్ తహసీల్దార్ బి.కన్యాకుమారి నూజివీడు పట్టణంలో తనిఖీలు చేపట్టగా టిఫిన్ సెంటర్లో వినియోగిస్తున్న ఆరు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.17,826లుగా ఉందని, హోటల్ యజమానిపై కేసునమోదు చేసినట్లు విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ పి.శివరామకృష్ణ తెలిపారు. దాడుల్లో డీటీ జి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.