కోడికత్తి శ్రీను కుటుంబం చేస్తున్న దీక్షకి టీడీపీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమ, మాణిక్యాలరావు తదితరులు మద్దతు ప్రకటించారు. కోడికత్తి శ్రీను కుటుంబానికి అండగా నిలుస్తామని బోండా ఉమ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ.. కోడి కత్తితో గాయం చేశాడని శ్రీనును ఇబ్బంది పెడుతుంటే.. బాబాయ్‌పై గొడ్డలి వేటు వేయించిన సీఎం జగన్‌ను ఏం చేయాలని ప్రశ్నించారు. ఏపీలో అంబేడ్కర్ రాజ్యాంగం నడవడం లేదన్నారు. శ్రీను ఇంకా లోపల ఉండడం అన్యాయమన్నారు. శ్రీను బయటకు వచ్చి మాట్లాడితే వాస్తవాలు బయట పడతాయని జగన్ భయపడుతున్నారన్నారు. టీడీపీ మొత్తం సావిత్రమ్మకు అండగా ఉంటుందని పిల్లి మాణిక్యాలరావు అన్నారు.