రా..కదలిరా.. పేరిట శుక్రవారం సాయంత్రం కమలాపురంలో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘కరువుతో కడప జిల్లా తీవ్రంగా నష్టపోయింది. కరువు పరిస్థితిని సీఎం జగనకు అధికారులు వివరిస్తే నా జిల్లాలో కరువేంటి అంటూ ఫైలును అధికారుల ముఖాన కొట్టడంతో అధికారులు చిన్నబుచ్చుకుని వెనుదిరిగారు. పులివెందులలో ఇన్నిసార్లు గెలిపించాం, మాకు ఒరగబెట్టిందేమీ లేదని అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. సొంత జిల్లాలోనే కరువు ప్రకటించకపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకోతున్నారు. నేను సీఎం అయింటే కేంద్రాన్ని ఒప్పించి కరువు రైతులను ఆదుకునేవాడిని’’ అని చంద్రబాబు అన్నారు.