ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ఆసక్తికర ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక కోవర్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. విజయవాడ దుర్గగుడికి చంద్రబాబు దంపతులు వచ్చిన సమయంలో నాని పట్ల చూపించిన ఆప్యాయత వీడియోను.. అలాగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో నాని పట్ల సీఎం జగన్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ‘కోవర్ట్ నాని అని తెలియక చంద్రబాబు గారు ఆ రోజు నీకు గౌరవం ఇచ్చారు. నువ్వు కోవర్ట్ అని తెలుసు కాబట్టి జగన్ రెడ్డి నీకు ఇచ్చిన అగౌరవం’ అని బుద్దా వెంకన్న పోస్ట్ పెట్టారు.